Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2కి బాలీవుడ్ ఫిదా.. రణ్‌వీర్ ట్వీట్‌కు జక్కన్న థ్యాంక్స్.. ట్వింకిల్ కన్నా కట్టప్పను..?

"బాహుబలి-2"కి బాలీవుడ్ స్టార్లంతా ఫిదా అవుతున్నారు. రాజమౌళితో పాటు బాహుబలి టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా రణవీర్ సింగ్ కూడా బాహుబలి-2 ఫ్యాన్ క్లబ్‌లో చేరిపోయాడు. రాజమౌళిని ఆకాశానికెత్తేస్

Webdunia
బుధవారం, 17 మే 2017 (20:33 IST)
"బాహుబలి-2"కి బాలీవుడ్ స్టార్లంతా ఫిదా అవుతున్నారు. రాజమౌళితో పాటు బాహుబలి టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా రణవీర్ సింగ్ కూడా బాహుబలి-2 ఫ్యాన్ క్లబ్‌లో చేరిపోయాడు. రాజమౌళిని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేస్తే మౌళి కూడా స్పందించి థ్యాంక్స్ చెప్పాడు.
 
ఇక అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా తామీ చిత్రాన్ని సోమవారం చూశామని, భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత రాజమౌళికే దక్కుతుందని ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. ట్వింకిల్ అయితే కట్టప్పను తన అభిమాన నటుడిగా చెప్పుకుంది. ట్వింకిల్ ఖ‌న్నా క‌ట్ట‌ప్ప న‌ట‌న‌కు ఫిదా అయిపోయింది. ఎంత‌లా అంటే త‌న కూతురును క‌ట్ట‌ప్ప అని పిలిచేస్తోంద‌ట‌.
 
క‌ట్ట‌ప్ప న‌ట‌న త‌న‌నెంతో ఆక‌ట్టుకుందంటూ ట్వీట్ చేసింది. అయితే ఇక్క‌డే ప‌ప్పులో కాలేసింది ఒక‌ప్ప‌టి ఈ ముద్దుగుమ్మ ట్వింకిల్‌. క‌ట్ట‌ప్ప పాత్ర‌ను పోషించింది త‌మిళ‌న‌టుడు స‌త్య‌రాజ్ కొడుకు సిబి స‌త్య‌రాజ్ అని భావించి అత‌నికి ట్వీట్ చేసింది. బాహుబ‌లి చిత్రంలో మీ న‌ట‌న అద్భుతంగా ఉందంటూ సిబీ స‌త్య‌రాజ్‌కు ట్వీట్ చేసింది. దీంతో రీట్వీట్ చేశాడు సిబీ స‌త్య‌రాజ్‌.
 
బాహుబ‌లి చిత్రంలో క‌ట్ట‌ప్ప క్యారెక్ట‌ర్ చేసింది త‌న తండ్రి స‌త్య‌రాజ్ అని చెప్ప‌డంతో షాక్‌కు గురైంద‌ట ట్వింకిల్‌. అంతేకాదు త‌న తండ్రి ట్వింకిల్ ఖ‌న్నా తండ్రి రాజేష్ ఖ‌న్నాకు వీరాభిమాని అని కూడా సిబి చెప్పుకొచ్చాడు. అంతేకాదు ట్వింకిల్ ద‌గ్గ‌ర‌నుంచి ట్వీట్ రావ‌డంతో త‌న తండ్రి స‌త్య‌రాజ్ హర్షం వ్యక్తం చేశాడని సిబి చెప్పుకొచ్చాడు. క‌ట్ట‌ప్ప న‌ట‌న‌కు ట్వింకిల్ ఖ‌న్నా ముగ్ధురాలై ఏకంగా ట్విట్టర్ డీపీని మార్చేసి క‌ట్ట‌ప్ప ఫోటోను పెట్టింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments