రంగీలాకు మూడు దశాబ్దాలు.. ఐకానిక్ పాటకు డ్యాన్స్ చేసిన ఊర్మిళ

ఠాగూర్
మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (11:27 IST)
రాంగోపాల్ వర్మ, ఊర్మిళ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం రంగీలా. ఈ చిత్రం వచ్చి మూడు దశాబ్దాలు అయింది. తాను స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి కారణమైన రంగీలా చిత్రం విడుదలై 30 యేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రంలోని ఐకానిక్ పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. మూడు దశాబ్దాలైనా తనలో గ్రేస్ తగ్గలేదని నిరూపిస్తూ, ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఊర్మిళ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. 'రంగీలా' సినిమాలోని సూపర్ హిట్ గీతం 'రంగీలారే'కు స్టెప్పులేస్తున్న వీడియోను పంచుకున్నారు. "రంగీలా కేవలం ఒక సినిమా కాదు, అదొక గొప్ప అనుభూతి. ప్రతి పాటా ఓ వేడుక. 30 ఏళ్ల క్రితం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఈ సినిమా, ఈనాటికీ అదే శక్తితో ఆ మొదటి క్షణంలోకి తీసుకెళ్తుంది. కలలు కనే ధైర్యాన్నిచ్చి నన్ను ఆదరించిన మీ ప్రేమకు ధన్యవాదాలు" అని ఊర్మిళ తన మనసులోని మాటలను పంచుకున్నారు.
 
1995లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రంగీలా' అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అమీర్ ఖాన్, జాకీ ప్రాఫ్, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంతో ఊర్మిళ మటోండ్కర్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ఆమె గ్లామర్, నటన యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
 
ఊర్మిళ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో మంది అభిమానులు, నెటిజన్లు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. 'అమీర్ - ఖాన్ ఊర్మిళ జోడీని మర్చిపోలేం', 'రంగీలా ఎప్పటికీ ఒక క్లాసిక్' అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మొత్తానికి, 30 ఏళ్లయినా 'రంగీలా' మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదని ఊర్మిళ పోస్ట్ మరోసారి నిరూపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

DK Aruna: తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా: డీకే అరుణ

Hyderabad: ఈ-ఆటో పార్కింగ్ పొరపాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. ఎలా?

ఆటోలో డిప్యూటీ సీఎం పవన్: మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం అస్సలు ఊహించలేదు సార్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments