Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గని ప్రేక్షకుల సందడి.. లాభాల పంట పండిస్తున్న "రంగస్థలం"

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో ఈ చిత్రం తరహాలో మరేచిత్రం

Webdunia
సోమవారం, 7 మే 2018 (16:23 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో ఈ చిత్రం తరహాలో మరేచిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించలేదు.
 
పైగా, ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఉండటంతో ఒక్కసారి చూసిన ప్రేక్షకుడు సైతం మళ్లీమళ్లీ థియేటర్‌కు వచ్చేలా చేస్తోంది. కథతో పాటు.. పాటలు, కథనం, ఫైట్స్ ఇలా అన్ని విధాలుగా చిత్రం బాగుంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. ఈ కారణంగా ఈ సినిమా లాభాల పంట పండిస్తూ వెళుతోంది.
 
నిజానికి ఈ చిత్రం విడుదలకు ముందే రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఆ తర్వాత ఈ సినిమా రూ.120 కోట్ల షేర్‌ను రాబట్టింది. నైజామ్ ఏరియాలో రూ.18 కోట్లకు అమ్ముడు కాగా, 34 రోజుల్లో రూ.27 కోట్లను వసూలు చేసింది. సీడెడ్‌లో రూ.12 కోట్లకు అమ్ముడుపోగా, ఇక్కడ రూ.17 కోట్లను రాబట్టింది. 
 
ఉత్తరాంధ్రలో రూ.8 కోట్లకి పోయిన ఈ సినిమా, రూ.12.08 కోట్ల షేర్‌ను తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ రైట్స్ రూ.9 కోట్లకి పోగా రూ.16.5 కోట్ల షేర్ వచ్చింది. ఇలా ఈ సినిమా భారీ లాభాలను సొంతం చేసుకుంటూ చరణ్ కెరియర్లోనే ది బెస్ట్‌గా నిలిచింది. మొత్తానికి చరణ్ ఈ ఏడాది మాస్ ఆడియన్స్‌కి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments