Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో 'చిట్టిబాబు' జోరు.. "రంగస్థలం" దెబ్బకు "శ్రీమంతుడు" బేజారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం "రంగస్థలం". హీరోయిన్ సమంత. కె. సకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (12:44 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం "రంగస్థలం". హీరోయిన్ సమంత. కె. సకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 
 
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా కనకవర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా, ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో ఈ చిత్రం చేరిపోయింది. తొలిరోజునే 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్‌ను సాధించిన ఈ సినిమా, ఆదివారానికి 2.32 మిలియన్ డాలర్లను రాబట్టింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 3 మిలియన్ డాలర్లను రాబట్టడం ఖాయమని అంటున్నారు. 
 
ఓవర్సీస్‌లో 'బాహుబాలి 2', 'బాహుబలి' తర్వాత ఫుల్‌రన్‌లో 'శ్రీమంతుడు' 2.87 మిలియన్ డాలర్లను సాధించి 3వ స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లో ఈ స్థానాన్ని 'రంగస్థలం' కైవసం చేసుకోనుందని చెబుతున్నారు. మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చిట్టిబాబు బాహుబలి మినహా ఇతర చిత్రాల రికార్డులను తిరగరాసేలా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments