ఇప్పుడు సమంత పేరు చెబితే టాలీవుడ్ ఇండస్ట్రీయే కాదు ఓవర్సీస్‌లోనూ ఒకే పేరు చెపుతున్నారు. అదేంటయా అంటే.... మిలియన్ డాలర్ల సమంత అనీ. ఈ మిలియన్ డాలర్ల సమంత అంటే ఏంటో అని అనుకుంటున్నారు కదా. మరేం లేదు... సమంత నటించిన చిత్రాలన్నీ ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్ష
ఇప్పుడు సమంత పేరు చెబితే టాలీవుడ్ ఇండస్ట్రీయే కాదు ఓవర్సీస్‌లోనూ ఒకే పేరు చెపుతున్నారు. అదేంటయా అంటే.... మిలియన్ డాలర్ల సమంత అనీ. ఈ మిలియన్ డాలర్ల సమంత అంటే ఏంటో అని అనుకుంటున్నారు కదా. మరేం లేదు... సమంత నటించిన చిత్రాలన్నీ ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన రంగస్థలం చిత్రం ఓవర్సీస్‌లో మొదటి రోజే మిలియన్ డాలర్ల మార్కు దాటేసి ముందుకు దూసుకువెళుతోంది.
అక్కినేని కోడలు కాకముందు ఆమె సక్సెస్ గ్రాఫ్ అలా సాగుతుండగానే ఇప్పుడు నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక నటించిన రంగస్థలం చిత్రం కూడా ఆమెకు మంచి విజయాన్ని సాధించిపెట్టింది. రంగస్థలంలో డీగ్లామర్ పాత్రలో రామలక్ష్మిగా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇకపోతే భవిష్యత్తులో తను నటించే పాత్రల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది సమంత. ఆమె నటించిన తదుపరి చిత్రం మహానటి త్వరలో విడుదల కాబోతోంది. మొత్తమ్మీద మిలియన్ డాలర్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని ఆశిద్దాం.