Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎముకలగూడులా మారిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో... ఎందుకని?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (14:28 IST)
బాలీవుడ్ స్టార్ హీరో చేస్తున్న సాహసం అలాంటి ఇలాంటిది కాదు. ఏకంగా ఎముకల గూడులా మారిపోయాడు. సినిమాలో తను నటించడు.. జీవిస్తాడు. అందుకే అతడి సినిమాలకు క్రేజ్ కూడా ఎక్కువే. ఇప్పుడు ఇతడు నటిస్తున్న చిత్రం పాకిస్తాన్ జైల్లో 23 ఏళ్లపాటు ఖైదీగా ఉండి చిత్రవధ అనుభవించిన సరబ్ జీత్ సింగ్ జీవితంపైన బయోపిక్. ఈ చిత్రాన్ని తీస్తున్నది ఓమంగ్ కుమార్. కాగా ఈ చిత్రంలో సరబ్ జీత్ పాత్రలో విభిన్న కోణాలను చూపించాల్సి ఉంటుంది. 
 
మంచి ఫిజిక్ అన్న వ్యక్తిగానూ, జైల్లో ఉన్నప్పుడు ఎముకలగూడులా మారిపోయినట్లుగా కనబడాలి. అందుకోసం కుమార్ ఎవరైతే ఇలాంటి పాత్రను చేస్తారా అని పలువురిని సంప్రదిస్తుండగా రణదీప్ హూడా తను అందుకు సిద్ధమని చెప్పేశాడు. అంతేకాదు... పాత్ర కోసం ఏకంగా 94 కేజీల బరువు నుంచి 66 కేజీలకు వచ్చేశాడు. 
 
ఇంకా శరీరంపై కండ లేకుండా అస్థిపంజరంలా మారిపోయాడు. అతడి ఆకారాన్ని చూసిన బాలీవుడ్ సినీజనం భయపడిపోయారట. ఐతే తేరుకుని అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నటనలో ఇలా కమిట్మెంట్ తో పనిచేసే వారు చాలా అరుదుగా ఉంటారు కదూ.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments