Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ ట్రైలర్‌ రాబోతుంది

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (16:26 IST)
Ranbir Kapoor, Sandeep Reddy
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ సాగా 'యానిమల్' ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక ఇంటెన్స్ ఇమేజ్ ని షేర్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వైల్డ్ రైడ్‌ 'యానిమల్' ట్రైలర్ నవంబర్ 23న విడుదల కానుంది.
 
దర్శకుడు షేర్ చేసిన ఫోటోలో రణబీర్ కపూర్ చిత్రంలోని తన పాత్రలో టెర్రిఫిక్ గా కనిపించారు. ఈ ఇంటెన్స్ విజువల్ అభిమానుల అంచనాలు మరింతగా పెంచింది. ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ పై అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. "ఒకే ఫ్రేమ్‌లో లెజెండ్స్" అంటూ తమ తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన యానిమల్ ప్రీ-టీజర్, టీజర్, పాటలు.. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఉత్సాహపరిచింది. ఒక్కో ప్రోమో సినిమాకు సంబంధించిన విభిన్న కోణాలను ప్రజెంట్ చేసింది. మరో 3 రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్‌ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుంది.
 
'యానిమల్'లో ర‌ణ్‌బీర్ క‌పూర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ ఇతర ప్రముఖ తారాగణం.
 
ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments