Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాల‌యాల్లో రణబీర్ కపూర్ యానిమల్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (12:27 IST)
Ranbir Kapoor
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా  హిందీలో రీమేక్ కబీర్ సింగ్ తోనూ  భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు. తాజాగా  బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌తో కలిసి మరో బ్లాక్ బస్టర్ విజయానికి శ్రీకారం చుట్టారు.  భూషణ్‌కుమార్‌, ప్రణవ్‌రెడ్డి వంగ కలిసి ఈ చిత్రాన్ని టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు.
 
కథానాయకుడి పాత్రకి తగ్గట్టు ఈ చిత్రానికి 'యానిమల్'అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని రెడీ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.  రణబీర్ కపూర్ ని ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించనున్నారు. ఈ సినిమా కోసం రణబీర్ స్పెషల్ గా మేకోవర్ అయ్యారు.
 
యాక్షన్ న్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'యానిమల్' చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే హిమాలయాల్లో మొదలైయింది.
 
భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుటున్న యానిమల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో  ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.  
 
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు.  
ఆగస్ట్ 11, 2023 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం అత్యున్నత టెక్నికల్ టీమ్ పని చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments