Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా నేను రాజు నేనే మంత్రి... శశికళపై సెటైర్లా?(వీడియో)

రానా బాహుబలి చిత్రం తర్వాత నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో క్రేజ్ లాగించేస్తున్నాడు. తెలుగులో ఇప్పటికే ఓ రేంజిలో ఆసక్తిని రేకిత్తించగా ఈ సినిమా తమిళంలో ''నాన్ ఆనైఇట్టాల్'' పేరుతో రిలీజ్ అవుతుంది. తెలుగులో నేనే రాజు నేనే మంత్రి సినిమా ట్రైలర్ రిలీజ్ కా

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (21:16 IST)
రానా బాహుబలి చిత్రం తర్వాత నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో క్రేజ్ లాగించేస్తున్నాడు. తెలుగులో ఇప్పటికే ఓ రేంజిలో ఆసక్తిని రేకిత్తించగా ఈ సినిమా తమిళంలో ''నాన్ ఆనైఇట్టాల్'' పేరుతో రిలీజ్ అవుతుంది. తెలుగులో నేనే రాజు నేనే మంత్రి సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. తమిళంలో ట్రైలర్ విడుదలైంది. తేజ దర్శకత్వంలో రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. 
 
ఇటీవల విడుదల చేసిన తమిళ టీజర్‌లోని ఓ డైలాగ్‌ పట్ల తమిళ రాజకీయ నాయకుల మధ్య ఆసక్తిని పెంచుతుంది. వంది మంది ఎమ్మెల్యేలను ఓ రిసార్ట్‌లో కూర్చోబెడితే నేను కూడా సీఎంనే.. అంటూ రానా చెప్పిన డైలాగ్ తమిళ రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది. పైగా ఈ సినిమాకు తమిళనాడు మాజీ సీఎం ఎంజీయార్‌ సినిమాలోని హిట్‌ సాంగ్‌ అయిన ‘నాన్‌ అనైయిట్టాల్‌’ పదాన్ని టైటిల్‌గా పెట్టారు. దీంతో తమిళ జనాలకు ఆసక్తి పెరిగింది. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత తమిళనాడులో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 
అన్నాడీఎంకే రెబెల్ పన్నీర్ సెల్వం పార్టీ నుంచి బయటికొచ్చి.. చిన్నమ్మపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అన్నాడీఎంకే వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్, శశికళ వర్గంగా మారింది. ఆపై బలపరీక్ష కోసం చిన్నమ్మ రెస్టారెంట్‌లో ఎమ్మెల్యేలను నిర్భంధించి పళనిసామిని సీఎం చేసిన సంగతి తెలిసిందే. ఇలా రెస్టారెంట్లో ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఎడప్పాడి పళనిసామిని సీఎం చేయడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. తాజాగా రానా కూడా చిన్నమ్మకు ఝలక్ ఇచ్చేలా తన సినిమాలో డైలాగ్ పేల్చాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments