Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా-మిహికాల వివాహానికి 30 మంది మాత్రమే.. అంతా కోవిడ్ ఎఫెక్ట్

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (18:47 IST)
బాహుబలి భల్లాలదేవుడు రానా వివాహం ఈ నెల 8వ తేదీన జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు పెళ్లి పనులు వేగం పెంచారు. తొలుత అనుకున్న ప్రణాళిక ప్రకారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ లేదా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చేయాలని భావించారు. 
 
ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేదికను మార్చారట. రోకా వేడుక నిర్వహించిన రామానాయుడు స్టూడియోస్‌లో వివాహం కూడా జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు.
 
వివాహ వేడుకకు వచ్చే వారి సంఖ్య 30 కూడా దాటదని తెలిసింది. చాలా కొద్దిమంది అతిథులు మాత్రమే దీనికి హాజరవుతారు. నానాటికీ కొవిడ్‌-19 కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న కారణంగా ఈ వేడుకను నిరాడంబరంగా జరుపుకుంటున్నట్లు రానా తండ్రి, నిర్మాత సురేశ్‌బాబు చెప్పుకొచ్చారు.
 
ఇక వివాహానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేడుక ప్రాంతంలో వీలైనన్ని చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేయడంతో పాటు, భౌతికదూరం పాటించేలా చూస్తామన్నారు. అది తమకు చాలా ప్రత్యేకమైన రోజని అందుకే భద్రత విషయం అస్సలు రాజీపడమని మిహిక తల్లి బంటి బజాజ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments