Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క్యాథ‌రిన్ హీరోహీరోయిన్లుగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం

రానా ద‌గ్గుబాటి హీరోగా నువ్వు నేను, జ‌యం వంటి విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో

Webdunia
శనివారం, 9 జులై 2016 (13:53 IST)
రానా ద‌గ్గుబాటి హీరోగా నువ్వు నేను, జ‌యం వంటి విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో తేజ తెరకెక్కించ‌నున్న ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క్యాథ‌రిన్ థెరిసాలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 600 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబ‌లి ది బిగినింగ్ చిత్రంలో భ‌ల్లాల‌దేవుడుగా మెప్పించిన రానా సెల‌క్టివ్‌గా సినిమాల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. 
 
తేజ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమాలో న‌టించ‌డానికి రానా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. 2006లో ల‌క్ష్మీ క‌ల్యాణం చిత్రంతో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిందే ద‌ర్శ‌కుడు తేజ‌. ఇప్పుడు దాదాపు ద‌శాబ్ద కాలం త‌ర్వాత తేజ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ మ‌రోసారి న‌టించ‌నుంది. అలాగే స‌రైనోడు వంటి మంచి స‌క్సెస్ త‌ర్వాత క్యాథ‌రిన్ ఓ విభిన్న‌మైన క్యారెక్ట‌ర్‌లో రానా స‌ర‌స‌న న‌టించ‌నుంది. 
 
ఈ చిత్రంలో త‌న‌కు అవ‌కాశం ఇచ్చినంద‌కు క్యాథ‌రిన్ ద‌ర్శ‌కుడు తేజ‌కు థాంక్స్ చెప్పారు. ఎంట‌ర్‌టైనింగా ద‌ర్శ‌కుడు తేజ ఈ స్క్రిప్ట్‌ను రూపొందించారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments