Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇద్దరి పాలిట రియల్ విలన్ అల్లు అరవింద్ : సినీ నటుడు రానా

సినీ నటుడు, 'బాహుబలి' విలన్ దగ్గుబాటి రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తమ పాలిట నిజమైన విలన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌ను ఒక్కసారి షాక్‌కు గురిచేశాయి. ఇం

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (15:49 IST)
సినీ నటుడు, 'బాహుబలి' విలన్ దగ్గుబాటి రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తమ పాలిట నిజమైన విలన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌ను ఒక్కసారి షాక్‌కు గురిచేశాయి. ఇంతకీ రానా ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలుసుకుందాం.
 
ఇటీవల సింగపూర్ వేదికగా సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. 'బాహుబలి' చిత్రంలో రానా నటనకుగాను ఉత్తమ విలన్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును రానాకు అల్లు అరవింద్ అందజేశారు. అవార్డు అందుకున్న అనంతరం రానా మాట్లాడుతూ, రియల్ విలన్ అయిన అల్లు అరవింద్ నుంచి ఈ అవార్డు అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందనడంతో అక్కడే ఉన్న మెగాస్టార్ చిరంజీవి సహా అందరూ ఆశ్చర్యపోయారు.
 
దీంతో తేరుకున్న రానా.. తాను అలా వ్యాఖ్యానించడానికి గల కారణాలను వివరించాడు. చిన్నప్పుడు తాను, రాంచరణ్ ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదివామని, క్లాస్‌మేట్స్‌మని, తామిద్దరం స్కూల్‌కి డుమ్మా కొట్టినా, పరీక్ష రాయకపోయినా, పరీక్షల్లో మార్కులు తగ్గినా అల్లు అరవింద్‌కు వెంటనే తెలిసి పోయేది. ఈ విషయాన్ని అల్లు అరవింద్ అందరికీ చెప్పేవారని, దీంతో తమ పరిస్థితి తలెత్తుకోలేకుండా ఉండేదని, అందుకే చరణ్‌కు, తనకు అరవింద్ అంటే భయమని, ఆయన తమ పాలిట రియల్ విలన్ అంటూ నాటి విషయాలను రానా గుర్తు చేసుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments