Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా నాయుడు సిరీస్ లో తండ్రిని చంపబోయిన కొడుకుగా రానా

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (10:14 IST)
venky-rana
నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయి, వెంకటేష్ దగ్గుబాటి కానీ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో రానా దగ్గుబాటి తండ్రీ కొడుకులుగా అలరిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో రూపొందిన కథ.  ట్రైలర్‌ను ముంబై లో విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. ఇందులో వెంకటేష్ జైలు నుంచి కొడుకు దగ్గరకి వస్తాడు. కానీ ఎందుకు వచ్చావు అని రానా నిలదీస్తాడు. ఫైనల్గా చంపటానికి గన్ గురి పెడతాడు. అప్పడు వెంకటేష్. అరె, నీకు 5 ఏళ్ళ నుంచి ముడ్డి కడిగి పెంచాను అంటాడు. ఇలా సెంటిమెంట్, యాక్షన్ థ్రిల్లర్ గా ఉంది. 
 
venky-rana
ప్రసిద్ధ అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కు ఎడాప్ట్టేషన్ అయిన రానా నాయుడు ప్రీమియర్ మార్చి 10, 2023న ప్రిమియర్ అవుతుంది.   దీనిని సుందర్ ఆరోన్ లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించారు. ఇండియా కోసం కరణ్ అన్షుమాన్ రూపొందించారు. ఈ సిరీస్‌కి కరణ్ అన్షుమాన్ & సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు.
 
రానా దగ్గుబాటి తన బాబాయ్, నెట్‌ఫ్లిక్స్‌తో మొదటిసారి కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్  చాలా కారణాల వల్ల ప్రత్యేకమైనది. ఇది నెట్‌ఫ్లిక్స్‌తో బాబాయ్ వెంకీతో నా మొదటి కొలాబరేషన్ . ఈ ప్రాజెక్ట్‌లో సుందర్ (ఆరోన్,) కరణ్ (అన్షుమాన్) సుపర్ణ్ (వర్మ)తో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం.  రానా నాయుడు దానిని అందించినందుకు సంతోషిస్తున్నాను. మొత్తం తారాగణం,  టీం ఈ సిరీస్  కోసం చాలా కష్టపడ్డారు.  ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. రానా నాయుడు పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించింది. అతను తన కుటుంబంతో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్న సంక్లిష్టమైన పాత్ర, అదే సమయంలో తన తండ్రితో అతని సంబంధంతో కూడా పోరాడే పాత్ర. రానా, నాగ  మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రపంచాన్ని అందరూ ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను’  అన్నారు. 
 
వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ .. ‘రానా నాయుడు’ లాంటి  ఎగ్జైటింగ్ షో కోసం మొదటిసారిగా మా అన్నయ్య గారి అబ్బాయితో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా అనిపించింది. నాగ పాత్రను పోషించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. నేను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదు. నాగ ఒక రిఫ్రెష్ చేంజ్.  ఈ పాత్ర తెలివైన, ఆకర్షణీయమైన లేయర్లుగా వుంటుంది.  నా అభిమానులు ఏం చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా విధాలుగా కొత్తది. ఈ సిరీస్‌లో ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతల బృందంతో కలిసి పనిచేయడం నిజంగా అద్భుతమైన అనుభవం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments