Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాలు చెపుతుంటే పాత్రలో లీనమై నిజంగానే ఏడ్చేశా : రమ్యకృష్ణ

'బాహుబలి 2' చిత్ర విజయంపై సినీ నటి రమ్యకృష్ణ మరోమారు స్పందించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో శివగామి, కట్టప్ప, భల్లాలదేవ, బాహుబలి పాత్రల నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో శివగామి పాత్

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (17:30 IST)
'బాహుబలి 2' చిత్ర విజయంపై సినీ నటి రమ్యకృష్ణ మరోమారు స్పందించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో శివగామి, కట్టప్ప, భల్లాలదేవ, బాహుబలి పాత్రల నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో శివగామి పాత్రధారి రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘బాహుబలి-2’లో తనను కన్నీరు పెట్టించిన సన్నివేశం ఒకటి ఉందన్నారు. 
 
ఈ చిత్రాన్ని తొలిసారి హైదరాబాద్‌లో చూశానని చెప్పింది. ఈ సినిమాలో శివగామి ముందుకు వచ్చి కట్టప్ప పచ్చి నిజాలు చెప్పే సన్నివేశం వచ్చినప్పుడు ఏడ్చేశానని, ఈ సన్నివేశం ఎంతో భావోద్వేగంతో నిండి ఉంటుందని, ఆ సన్నివేశంలో నటించడం తనకు చాలా నచ్చిందని చెప్పింది. నిజంగా ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించడం పడిన కష్టానికి దక్కిన ఫలితమని తెలిపింది. 
 
ఇకపోతే 'బాహుబలి-2' సినిమా సిగలో ఎన్నో అరుదైన రికార్డులు వచ్చి చేరుతున్నాయి. తాజాగా మరో రికార్డు 'బాహుబలి-2' ప్రతిష్టను మరింత పెంచుతోంది. ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన 'బాహుబలి-2'... ఇప్పుడు తాజాగా 1200 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హిందీ వెర్షన్‌లోనే 360 కోట్ల రూపాయలు వసూలు చేసిన 'బాహుబలి-2', అమెరికాలో 100 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా చరిత్రకెక్కింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments