Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూకు అత్తగా శివగామి.. నాగ్- రమ్య పాటకు చైతూ-తమన్నా చిందులు?

అక్కినేని నాగచైతన్య హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''శైలజా రెడ్డి అల్లుడు''. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో బాహుబలి శివగామి.. రమ్యకృష్ణ అత్త పాత్రలో

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (14:37 IST)
అక్కినేని నాగచైతన్య హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''శైలజా రెడ్డి అల్లుడు''. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో బాహుబలి శివగామి.. రమ్యకృష్ణ అత్త పాత్రలో కనిపించనుంది. చైతూకు అత్తగా ఈ సినిమాలో రమ్య కనిపించనుంది. ఈ చిత్రానికి రమ్యకృష్ణ పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని సినీ యూనిట్ అంటోంది. 
 
సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే సగానికి సగం పూర్తయ్యింది. ఈ 18వ తేదీ నుంచి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షెడ్యూల్ జరుగనుంది. 15 రోజులపాటు జరిగే ఈ షూటింగ్‌లో చైతూ, రమ్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సన్నివేశాలుంటాయని సినీ యూనిట్ చెప్తోంది. కాగా ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. 
 
ఇదిలా ఉంటే.. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ''సవ్యసాచి''. ఇందులో  హీరోగా నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికా కనిపిస్తుండగా, మాధవన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
 
అల్లరి అల్లుడు సినిమా నుంచి అప్పట్లో విడుదల అయిన ''నిన్ను రోడ్డు మీద చూసింది లగ్గాయిత్తు''పాట ఒక రేంజ్‌లో హిట్ అయింది. కీరవాణి సంగీతం, కింగ్ నాగార్జున డాన్స్‌తో పాటు రమ్యకృష్ణ గ్లామర్‌తో ఈ పాట అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పాటను సవ్యసాచి కోసం రీమీక్స్ చేయనున్నారు. ఈ పాటకు చైతూతో స్టెప్పులేసేందుకు తమన్నా సై అందని సమాచారం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments