బాహుబలి-2 భారత్ నుంచి వచ్చిన అవతార్: ఆకాశానికెత్తిన వర్మ

ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’కి ప్రశంసల పరంపర కొనసాగుతోంది. ఇక రాంగోపాల్ వర్మ అయితే చెప్పాల్లిన పనిలేదు. ఇక నుంచి సినిమా పరిశ్రమను బాహుబలికి ముందు తర్వాతగా పేర్కొంటారంటూ వ్యాఖ్యానించిన రామ్‌గోపాల్‌వర్మ మరోసారి తనదైన శైల

Webdunia
సోమవారం, 1 మే 2017 (07:48 IST)
బాహుబలి-2 సినిమాకు ఒకవైపు కలెక్షన్లు పోటెత్తుతుంటే మరోవైపు ప్రశంసలు నింగినంటుతున్నాయి. భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని వసూళ్లకు తెర తీసిన బాహుబలి-2 ఒక విజువల్ వండర్‌గా చూసిన ప్రతి ఒక్కరికీ దిగ్బ్రాంతి కలిగిస్తుంటే మరోవైపు దేశమంతా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’కి ప్రశంసల పరంపర కొనసాగుతోంది. ఇక రాంగోపాల్ వర్మ అయితే చెప్పాల్లిన పనిలేదు. ఇక నుంచి సినిమా పరిశ్రమను బాహుబలికి ముందు తర్వాతగా పేర్కొంటారంటూ వ్యాఖ్యానించిన రామ్‌గోపాల్‌వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ‘బాహుబలి2’ను హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ రూపొందించిన ‘అవతార్‌’తో పోలుస్తూ ట్వీట్‌ చేశారు.
 
‘బాహుబలి2 ప్రభావం బాలీవుడ్‌పై బాగా పడింది. ప్రతీ సూపర్‌ డైరెక్టర్‌, సూపర్‌స్టార్‌ తన తర్వాతి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు ఈ చిత్రాన్ని ఉదాహరణగా చెబుతారు. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ భారత్‌ నుంచి వచ్చిన ‘అవతార్‌’లాంటింది. ‘అవతార్‌’ కోసం జేమ్స్‌ కామెరూన్‌ ఖర్చుపెట్టిన సమయం, డబ్బు కన్నా దర్శకుడు రాజమౌళి చాలా తక్కువవెచ్చించారు.’ అని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.
 
టాలీవుడ్ హీరోలను ట్వీట్లతో ఆడుకుంటున్న వర్మ బాహుబలి ది బిగినింగ్ సమయం నుంచి రాజమౌళిని అంతెత్తున నిలిపి పొగుడుతున్న విషయం తెలిసిందే. తెలుగు దర్శకులందరినీ రాజమౌళి బాహుబలి కత్తితో చీల్చి చెండాడాడని అప్పట్లోనే వర్మ కొనియాడారు. ఇప్పుడు బాహుబలి దర్సకుడిని, నటీనటులను, సాంకేతిక సిబ్బందిని వర్మ ఒక రేంజిలో పొగుడుతుండటం టాలీవుడ్‌ను కంపరమెత్తిస్తోందంటే అతిశయోక్తి కాదు. రాజుగారి పెద్ద భార్య పతివ్రత అంటే చిన్న భార్య విషయం గుర్తుకొస్తున్నట్లుగా బాహుబలి పేరు చెప్పి మామీద పడటం ఏమిటి అంటూ టాలీవుడ్ దర్శకులు, హీరోలు లోపల కాగిపోతున్నారని సమాచారం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments