Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ ' కిల్లింగ్ వీరప్పన్' జనవరి 1, 2016న వస్తాడా...? రాడా...?

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2015 (20:58 IST)
రామ్‌గోపాల్‌ వర్మ... కిల్లింగ్ వీరప్పన్‌ సినిమాను తీస్తున్నట్లు చెప్పగానే.. వీరప్పన్‌ భార్యను కలవడం... ఆమెతో వివరాలు సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఆమె చిత్రాన్ని చూసి.. తాను చెప్పినదాన్ని విరుద్ధంగా తీశాడని కేసు వేయడంతో బ్రేక్‌ పడుతుందేమోనని... ఆమెతో రాజీకి వచ్చాడు. ఎట్టకేలకు జనవరి 1న 'కిల్లింగ్‌ వీరప్పన్‌' విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. 
 
అయితే ఈ చిత్రం విడుదలకు కొన్ని ఇబ్బందులు వచ్చాయని తెలుస్తోంది. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన పన్నీర్‌ సెల్వి మద్రాస్‌ హైకోర్టులో ఈ పిటిషన్‌ వేశారు. వీరప్పన్‌ సినిమా మొత్తం తప్పులతడకగా ఉందని, విడుదలను ఆపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలని ఆమె కోర్టును కోరారు. దీంతోపాటు వీరప్పన్‌ సినిమాకు జారీ చేసిన 'యు' సర్టిఫికెట్‌ ఉపసంహరించుకోవాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని కోరారు. 
 
ఇందుకు కారణం వీరప్పన్‌ హత్యను వర్మ తనిష్టం వచ్చినట్లు రాసుకున్నాడనీ, వాస్తవానికి విరుద్ధమని పేర్కొన్నారు.   2004లో వీరప్పన్‌‌ను చంపడంలో కర్ణాటక పోలీసులనే బాధ్యులుగా చిత్రీకరించారన్నారు. ఈ క్రమంలో తమిళనాడు పోలీసులు, రాజకీయవేత్తలను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. దీంతో జనవరి 1న విడుదల అవుతుందో లేదో అనుమానంగా వుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments