అమృత్‌సర్‌లోని ఖాసా ప్రాంతంలో తెలుగు హీరో రామ్‌చరణ్‌ను చూసి BSF సైనికులు సంతోషించారు. అక్కడ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆర్.సి. 15 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్బంగా షూట్ ముగింపురోజున ఆయన అక్కడి సైనికులు లంచ్‌కు ఆహ్వానింగా ఆయన తన ఇంటినుంచి తెచ్చుకున్న వ్యక్తిగత వంటగాడిని అక్కడికి పంపి ప్రత్యేకంగా వెజిటేరియన్ వండించారు.
Ramcharan, BSF soldiers
రామ్‌చరణ్ చెఫ్ చేసిన వంటకం సైనికులకు బాగా నచ్చింది. భోజనం సందర్భంగా సైనికులు డ్రిల్‌తరహాలో వందన కార్యక్రమం నిర్వహించి లంచ్ చేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్,సైనికుల డిసిప్లెన్, వ్యక్తిత్వాలను మెచ్చుకున్నారు. ఈరోజే ఉపాసన కూడా స్వర్ణదేవాలయంలో సేవ చేసినట్లు ఫొటోలు పెట్టింది. ఇప్పుడు రామ్‌చరన్ సైనికులతో లంచ్ ఫొటోలు పెట్టాడు.
శంకర్ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక పాత్ర సైనికుడిగా వుంటుందని చిత్ర యూనిట్ తెలియజేస్తుంది. ఇంకా ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.