Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల నటుడినుంచి అంతర్జాతీయ నటుడిగా ఎదిగిన ఎన్.టి.ఆర్.

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (17:43 IST)
NTR 23 years carer
తన నటనతో ప్రేక్షక లోకాన్ని అలరించిన నందమూరి తారక రామారావు (జూ.ఎన్.టి.ఆర్.)సినీ ప్రస్థానం నేటితో 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  గుణశేఖర్ దర్శకత్వం వహించిన రామాయణంలో బాల కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ అరంగేట్రం చేశారు.  1996లో విడుదలైన ఈ చిత్రం 2021 కు 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో, జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. . రామాయణం కంటే ముందు, జూనియర్ ఎన్టీఆర్ 1991లో విడుదలైన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటుడిగా కనిపించారు.
 
ఇక 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. అలా హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. అలాంటి దర్శకుడితో 2019 లో రామ్ చరణ్ తో నటించిన ఆర్. ఆర్. ఆర్. సినిమా ప్రపంచ కీర్తి తెచ్చి పెట్టింది.
 
ఇక ఆయన ఒక్కో సినిమా ఒక్కో శైలిలో వుంటుంది. ఆది, టెంపర్, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు చేసినా సుబ్బు, అల్లరి రాముడు ఆయనకు బాగా పాఠాలు నేర్పింది. దాంతో ఆచి తూచి సినిమాలు చేస్తూ ముందుగు సాగారు. ఆయన జై లవకుశ లో చేసిన మూడు పాత్రల వేరియేషన్ సీనియర్ ఎన్.టి.ఆర్.ను తలపించేలా చేసింది. పరిపూర్ణ నటుడిగా ఆ సినిమాలో కనిపించారు. అలా ఒక్కో సినిమా చేసుకుంటూ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా దేవర లో నటిస్తున్నారు. ఇందులో భారతదేశంలోని పలు భాషల్లోని నటీనటులు నటించడం విశేషం. అదేవిధంగా బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న ఆయన హాలీవుడ్ సినిమాలో నూ నటించనున్నారు. ఆ వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments