Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ పూర్తి - విడుద‌ల తేదీ ప్ర‌క‌ట‌న‌

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (17:58 IST)
Rama Rao on Duty
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదీలావుండగా ఈరోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
 
'రామారావు ఆన్ డ్యూటీ' జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. సినిమా థియేట్రికల్ విడుదలకు దాదాపు ఒక నెల సమయం ఉంది. రానున్న రోజుల్లో భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌ కు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ పోస్టర్ టెర్రిఫిక్ గా వుంది. రవితేజ తీక్షణంగా ఆలోచిస్తూ సీరియస్ గా చూస్తున్న ఇంటెన్స్ లుక్ ఆసక్తికరంగా వుంది. హై వోల్టేజ్ యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.
 
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
సామ్ సిఎస్  సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మొదటి రెండు పాటలు మెలోడీ హిట్స్ గా నిలిచి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
 
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments