Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీ ప్రీత్ సింగ్ ఎక్కడుంది.. డేరా బాబాను అడిగిన పోలీసులు

డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దత్త పుత్రిక, హనీప్రీత్‌ సింగ్‌ నేపాల్‌లో తలదాచుకుందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. నేపాల్‌లో హనీప్రీత్ సింగ్ ఉందనే వార్తలు అవాస్తవమని ఆ దేశ సెంట్ర

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (15:39 IST)
డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దత్త పుత్రిక, హనీప్రీత్‌ సింగ్‌ నేపాల్‌లో తలదాచుకుందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. నేపాల్‌లో హనీప్రీత్ సింగ్ ఉందనే వార్తలు అవాస్తవమని ఆ దేశ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పష్టం చేసింది. ఆమె కదలికలపై గతంలో తామిచ్చిన సమాచారం అవాస్తవమని నేపాల్ సీబీఐ డైరెక్టర్ పుష్కర్ కార్కి తెలిపారు.
 
డేరా సచ్ఛా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ జైలుకి వెళ్లిన నాటి నుంచి అతనిని తప్పించేందుకు ప్రయత్నించిన దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. డేరాబాబాను తప్పించే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలపై అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. 
 
నేపాల్ సరిహద్దుల్లో వాంటెడ్ పాంప్లెట్లు కూడా అతికించారు. ఆమెను పట్టుకోవడాన్ని నేపాల్ సరిహద్దుల్లో గాలింపు చేపట్టారు. అయితే చివరికి హనీప్రీత్ సింగ్ ఆచూకీ లభించకపోవడంతో డేరా బాబాను పోలీసులు ప్రశ్నించాలని నిర్ణయించారు. హనీప్రీత్ ఆచూకీ ఎక్కడుందో డేరా బాబాకే తెలుసునని పోలీసులు నమ్ముతున్నారు. అందుకే అతని వద్ద పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments