Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

దేవీ
గురువారం, 20 మార్చి 2025 (10:08 IST)
Ram Pothineni, Rahul Ramakrishna, Director. mahesh
రామ్ పోతినేని కథానాయకుడిగా  రామ్ 22వ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'  తర్వాత మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ఇంకా టైటిల్ ఖరారుచేయని ఈ సినిమా రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ ముగించుకుని చిత్ర బృందం హైదరాబాద్ వచ్చింది.
 
రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్‌ స్టాప్‌గా డే అండ్ నైట్ షూటింగ్ చేసింది RAPO22 యూనిట్. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకా ఇంపార్టెంట్ టాకీ సీన్స్ షూటింగ్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లను అంతే అందంగా క్యాప్చర్ చేశామని చిత్ర బృందం చెబుతోంది.
 
రాజమండ్రిలో జరిగిన చిత్రీకరణలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సహా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితర తారాగణం మీద సినిమా చిత్రీకరించారు. మార్చి 28వ తేదీ నుంచి హైదరాబాద్ షెడ్యూల్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు.
 
రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని, మ్యూజిక్: వివేక్ - మెర్విన్, సీఈవో: చెర్రీ, ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, కథ - కథనం - దర్శకత్వం: మహేష్ బాబు పి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Telangana: లండన్‌లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి

రూ.476 కోట్ల విలువైన విమానం నీటిపాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments