Webdunia - Bharat's app for daily news and videos

Install App

వావ్... లాడెన్ కంటే లోకేశ్ భయంకరంగా ఉన్నాడు... డైలాగ్ డెలివరీ ఫెంటాస్టిక్ అంటున్న వర్మ

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:42 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌లను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. వర్మ తాజా చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రంలో చంద్రబాబు వెన్నుపోటు వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 
 
ఈ క్రమంలో తాజాగా నారా లోకేశ్‌కు సంబంధించి ఓ మార్ఫింగ్ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "వావ్... ఈ అద్భుత పర్సనాలిటీని చూసి నాకు భయం వేస్తోంది. ఇతను ఎవరో నాకు తెలియదు. కానీ, ఇతను దావూద్ ఇబ్రహీం, ఒసామా బిన్ లాడెన్, పరిటాల రవికన్నా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఎవరైనా ఇతను ఎవరో చెప్పగలరా?" అంటూ ఓ మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేశాడు. 
 
ఆ తర్వాత మరో ట్వీట్ పెడుతూ, "అరవింద సమేత చిత్రంలో తారక్ బదులు ఇతన్ని పెట్టి ఉంటే మూడురెట్ల ఘన విజయాన్ని సాధించివుండేది" అన్నారు. అంతటితో ఊరుకోని వర్మ, "ఎవరో ఇతను రాజకీయాల్లో ఉన్నాడని చెప్పారు. కానీ నేను మాత్రం సినీ పరిశ్రమలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. అతని డైలాగ్ డెలివరీ ఫెంటాస్టిక్. అతని వాక్చాతుర్యాన్ని జూనియర్ ఎన్టీఆర్‌తో పోల్చవచ్చు. సినిమా స్టార్‌కాకుండా రాజకీయాల్లో ఎందుకు సమయం వృథా చేసుకుంటున్నాడో" అంటూ మరో ట్వీట్ పెట్టి " మరో వివాదానికి తెరలేపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments