Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి వంటి అన్న నాకుంటేనా..?... రియల్లీ సారీ టూ హిమ్ : రాంగోపాల్ వర్మ

మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల తర్వాత ఏర్పడిన వివాదాన్ని తగ్గించాలని భావించాడో ఏమో, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఎట్టకేలకు దిగివచ్చి.. మెగా ఫ్యామిలీకి సారీ చెప్పాడు.

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (10:58 IST)
మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల తర్వాత ఏర్పడిన వివాదాన్ని తగ్గించాలని భావించాడో ఏమో, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఎట్టకేలకు దిగివచ్చి.. మెగా ఫ్యామిలీకి సారీ చెప్పాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, 'చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే నేను మాట్లాడిన మాటలకి చితక్కొటేవాడిని. నాగబాబు మాటలతోనే వదిలేశారు. రియల్లీ సారీ టూ హిమ్ (ఆయనకు నిజంగా క్షమాపణలు)' అంటూ ట్వీట్ చేశారు. 
 
ఇటీవల వర్మ తన తల్లిపై, బిగ్ బీ అమితాబ్‌పై, హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‌పై ఒట్టేసి తన వైఖరిని మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, పవన్ ఫ్యాన్స్‌కు, గణపతి భక్తులకు క్షమాపణలు చెబుతున్నట్లు కూడా ట్వీట్ చేశాడు. అయితే తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 
 
మెగా బ్రదర్ నాగబాబుపై తాను చేసిన కామెంట్స్‌కు వర్మ క్షమాపణలు కోరాడు. దీంతో విస్తుపోవడం సినీ జనం వంతైంది. నిజంగా ఈ ట్వీట్ చేసింది వర్మేనా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో వర్మ చేసిన ఈ ట్వీట్స్‌తో మెగా అభిమానులు శాంతించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నందుకు సంతోషం అంటున్నారు. వర్మలో వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందో, లేక అంతా తూచ్ ఆ ట్వీట్స్ చేసింది తాను కాదని మళ్లీ ట్వీట్ చేస్తాడోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, 'ఖైదీ నంబర్ 150' ప్రీ రిలీజ్ వేడుకలో రాంగోపాల్ వర్మపై చిరంజీవి సోదరుడు నాగబాబు తీవ్రంగా విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఆపై వర్మ సైతం నాగబాబును టార్గెట్ చేస్తూ పలు ట్వీట్లు వదిలారు. తాజాగా వర్మ క్షమాపణలతో ఆ వివాదం సద్దుమణిగిందనే భావించాలేమో!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments