Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆరాధ్య దేవత మరలిరాని లోకాలకు తరలిపోయింది : కన్నీరు తెప్పిస్తున్న ఆర్జీవీ ట్వీట్

వివాదాలు ఏరికోరి తెచ్చుకునే దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. అలాగే, నటి శ్రీదేవి అంటే ప్రాణమిచ్చేంతటి అభిమానం.. పిచ్చి. అందుకే ఆమె ఇకలేరనే వార్తను ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు.

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (16:09 IST)
వివాదాలు ఏరికోరి తెచ్చుకునే దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. అలాగే, నటి శ్రీదేవి అంటే ప్రాణమిచ్చేంతటి అభిమానం.. పిచ్చి. అందుకే ఆమె ఇకలేరనే వార్తను ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. శ్రీదేవి మరణ వార్త వెలువడినప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదు. తన ఇంట్లో తన గదికే పరిమితమై.. శ్రీదేవి పాటలకు సంబంధించిన వీడియోలు చూస్తుండిపోయారు. 
 
ఈ నేపథ్యంలో శ్రీదేవి అంతిమయాత్ర బుధవారం మధ్యాహ్నం అభిమానుల అశ్రునయనాల మధ్య ప్రారంభమైంది. దీంతో ఆర్జీవీ ప్రతి ఒక్కరికీ కన్నీరు తెప్పించేలా ట్వీట్ చేశారు. 'థియేటర్స్‌లో శ్రీదేవి అద్భుతమైన ఎనర్జీతో చేసే డ్యాన్స్‌ను, యాక్టింగ్‌ను చూసేందుకు జనం అలా కూర్చుండిపోయేవారు. అలాగే ఇప్పుడు కూడా ఆమె చుట్టూ జనం ఉన్నారు. కానీ కన్నీళ్లతో పగిలిన హృదయాలతో అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన ప్రతి ఒక్కరూ శ్రీదేవి అంటే ఆర్జీవికి అంత అభిమానమా అంటూ రీ ట్వీట్లు చేస్తున్నారు. 
 
నిజానికి శ్రీదేవి మరణవార్త దేశం మొత్తాన్ని కలచి వేచింది. ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకైతే ఇది ఎంత బాధాకరమో మనం ఊహించగలం. శ్రీదేవి అంటే ఆయనకు ఎంత అభిమానమో చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఆమె నటించిన ఓ సాంగ్‌ను మైమరిచిపోయి నేల మీద కూర్చొని చూస్తుండగా తీసిన వీడియోను కూడా చూశాం. అంతటి ఆరాధ దేవత మరలిరాని లోకాలకు తరలిపోతుంటే ఆయన్న కన్నీరు కారుస్తూ మౌనంగా కూర్చొండిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.. బస్సులు, రైళ్లలో ఒకటే జనం.. ఏపీ ప్రజలకు ఏమైంది?

వైజాగ్ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం : రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి

షాకింగ్ వీడియో : లోనావాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం (Horror Video)

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చెయ్యడమంటే కొరివితొ తల గొక్కోవటమే : వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments