Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రూస్ లీ స్ఫూర్తితో అమ్మాయి సినిమా తీశానంటున్న రామ్ గోపాల్ వర్మ

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (19:34 IST)
Bruce Lee, Ammai,
ఎన్నో చిత్ర‌మైన ప్ర‌యోగాలు చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మార్ష‌ల్ ఆర్ట్ నేప‌థ్యంలో ఓ సినిమా తీశాన‌ని తెలియ‌జేస్తున్నారు. ఆ సినిమా పేరు `అమ్మాయి`. బ్రూస్ స్పూర్తిగా తీసుకుని లేడీ బ్రూస్‌లా చేశాన‌ని చెబుతున్నాడు. అందుకు త‌గిన‌ట్లుగా అమ్మాయి డ్రెస్ కూడా వున్న ఫొటోలు రిలీజ్ చేశాడు.
 
ఈ చిత్రాన్ని హిందీ, చైనీస్ భాషలో విడుదలకు సిద్ధం అవుతుండగా తెలుగు, తమిళ,  కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు..
 
ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా ఆర్ట్ సి మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్ మరియు చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రం ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. 
 
Bruce Lee, Ammai,
“అమ్మాయి” చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులు అయినా పూజ భలేకర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తన ఫైటింగ్ స్కిల్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి.  ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ కి అంకితం ఇస్తున్నారు. 
 
“అమ్మాయి” చిత్రం భారత దేశంలోనే మొదటి వాస్తవికమైన మార్షల్ ఆర్ట్స్ చిత్రం.
 
అమ్మాయి చైనీస్ వెర్షన్ చిత్రాన్ని చైనా లోని భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ వారు డ్రాగన్ గర్ల్ పేరుతో భారీ ప్రమోషన్ తో  20 వేల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. 
 
చైనా లో నవంబర్ 27న బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు సందర్భంగా ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లి ప్రారంభ చిత్రంగా ప్రదర్శింపబడుతోంది. అంతే కాకుండా దుబాయ్ లో ప్రపంచం లోనే ఎతైన బుర్జ్ ఖలీఫా భవనం మీద అమ్మాయి చిత్రం మొదటి ప్రపంచ ప్రోమోని చూపించబోతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

నేటి నుంచి ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లో మార్పులు.. క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు...

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments