Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘బాహుబలి-2’ చూడటానికి అరుణగ్రహం నుంచి గ్రహాంతరవాసులు స్పేస్‌షిప్‌లో భూమికి వస్తున్నారట

అంతా అనుకున్నట్టుగానే భారీ అంచనాలతో విడుదలైన ‘బాహుబలి-2’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్నది. ఇప్పటికే రూ. 600 కోట్ల రూపాయల క్లబ్బులో చేరిన ఈ సినిమా భారత సినీ చరిత్రలో వెయ్యికోట్ల ర

Webdunia
బుధవారం, 3 మే 2017 (02:51 IST)
అంతా అనుకున్నట్టుగానే భారీ అంచనాలతో విడుదలైన ‘బాహుబలి-2’  బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్నది. ఇప్పటికే రూ. 600 కోట్ల రూపాయల క్లబ్బులో చేరిన ఈ సినిమా భారత సినీ చరిత్రలో వెయ్యికోట్ల రూపాయ క్లబ్బులో చేరే తొలి సినిమాగా రికార్డు సృష్టించినప్పటికీ ఏమాత్రం  ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ పండితులు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా కొంతమందికి ‘బాహుబలి-2’ సినిమా నచ్చి ఉండకపోవచ్చు. అలా ఈ సినిమా నచ్చనివారు ఎవరైనా ఉంటే వారికోసం దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తనదైన స్టైల్‌ ముందుకొచ్చారు. 
 
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వర్మ ‘బాహుబలి-2’ సినిమాను మాత్రం ప్రశంసలతో ఆకాశానికెత్తేశారు. ఈ నేపథ్యంలోనే ‘ఎవరికైనా ‘బాహుబలి-2’ సినిమా నచ్చకపోతే వారిని చూసి నేను బాధపడతాను. వారికి మానసిక వైద్యుడి సాయం అవసరముంది. అలాంటి వారి డాక్టర్‌ బిల్లు స్వచ్ఛంద సేవ కింద నిర్మాత శోభూ భరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని వర్మ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ప్రేక్షకులు ‘బాహుబలి-2’  ఆదరిస్తున్న పరిస్థితిని చూస్తుంటే.. ఈ సినిమా చూడటానికి అరుణగ్రహం నుంచి గ్రహాంతరవాసులు స్పేస్‌షిప్‌లో భూమికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ తనదైన స్టైల్‌లో పేర్కొన్నారు.
 
 
Ram Gopal Varma ✔ @RGVzoomin
Be sad on person who disliked #Baahubali2 as heher needs psychiatric help nd I request producer @Shobu_ in to pay doctor bill for charity

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments