Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి''ని పవన్‌తో పోల్చిన వర్మ: విజయ్ దేవరకొండ పవన్ కంటే పదిరెట్లు బెటర్

అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. అయితే రిలీజ్‌కు తర్వాత ఆ వివాదాలు కాస్త మాయమయ్యాయి. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (18:26 IST)
అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. అయితే రిలీజ్‌కు తర్వాత ఆ వివాదాలు కాస్త మాయమయ్యాయి. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా ప్రేక్షకుల మదిని దోచుకోవడంతో పాటు ఓవర్సీస్ బాక్సాఫీసు దుమ్ముదులుపుతోంది.

యువతకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోతో పాటు, మొదటి రోజు కలెక్షన్లను కలిపి 4లక్షల 60వేల డాలర్లును 'అర్జున్ రెడ్డి' రాబట్టింది. దీంతో అల్లు అర్జున్ సరైనోడు, నాని నిన్నుకోరి, చెర్రీ ధృవ సినిమాలను అర్జున్ రెడ్డి వెనక్కి నెట్టాడు. 
 
ఇకపోతే అర్జున్ రెడ్డి వివాదాల్లో చిక్కుకున్న తరుణంలో అండగా నిలిచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందించాడు. సినీన‌టుడు పవన్ కల్యాణ్ కన్నా ‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరో విజయ్ దేవరకొండ పది రెట్లు బెటరని వర్మ ఫేస్‌బుక్ ఖాతాలో కామెంట్ చేశాడు. దీంతో మళ్లీ పవన్‌పై వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అర్జున్ రెడ్డి సినిమాను మెచ్చుకుంటూ ఫేస్‌బుక్‌లో పెద్ద వ్యాసం రాసిన వర్మ.. అందులో పవన్‌ను దేవరకొండతో పోల్చుతూ హెడ్డింగ్ పెట్టాడు. విజయ్ దేవరకొండ నేచురల్‌గా నటించిన తీరు అద్భుతమని ప్రశంసల జల్లు కురిపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

జమ్మూ కాశ్మీర్‌కు చార్మిత్రాత్మక మైలురాయిగా మొదటి సరుకు రవాణా రైలు

కుల్గాంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు, 9 మంది గాయపడ్డారు, ముగ్గురు ఉగ్రవాదులు హతం

లక్షద్వీప్ దీవులలోని ఉపాధ్యాయుల కోసం ఏఐ శిక్షణా కార్యక్రమం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments