Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా పవర్ స్టార్‌కు గౌరవ డాక్టరేట్.. ప్రకటించిన చెన్నైలోని ప్రైవేట్ వర్శిటీ!!

వరుణ్
గురువారం, 11 ఏప్రియల్ 2024 (17:31 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ త్వరలోనే గౌరవ డాక్టర్ కానున్నారు. ఆయనకు చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. దీన్ని ఈ నెల 13వ తేదీన జరిగే స్నాతకోత్సవంలో ప్రదానం చేయనుంది. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదాన చేస్తున్నట్టు ఆ యూనివర్శిటీ చాన్సరల్ డాక్టర్ ఐసర్ కె.గణేష్ తెలిపినట్టు స్థానిక తమిళ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. 
 
'ఆర్‌ఆర్‌ఆర్‌', 'ఆచార్య' తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. సెన్షేనల్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది సిద్ధమవుతోంది. అంజలి, ఎస్‌.జె.సూర్య, జయరామ్‌, సునీల్‌, నాజర్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
పాన్‌ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, 'ఉప్పెన' ఫేమ్‌ బుచ్చిబాబుతో చరణ్‌ ఇటీవల కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు. జాన్వీకపూర్‌ కథానాయిక. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

Andhra Pradesh Lok Sabha Election results 2024 Live: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024

సుప్రీంకోర్టులో వైకాపాకు వరుస ఎదురుదెబ్బలు... పిన్నెల్లికి సుప్రీం షాక్

ఎన్నికల కౌంటింగ్- సోషల్ మీడియా యూజర్లకు స్ట్రాంగ్ వార్నింగ్

ఓటు హక్కు వినియోగంలో ప్రపంచ రికార్డు సృష్టించాం : మహిళా ఓటర్లకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చిన ఈసీ

లిక్కర్ స్కామ్ కేసు.. జూలై 3వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments