Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ బాటలో చెర్రీ.. బాబాయ్ శ్రీజకు సాయం చేస్తే.. అబ్బాయ్ ధనుష్‌కు చేయూతనిచ్చాడు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ పయనిస్తున్నాడు. అప్పట్లో క్యాన్సర్‌తో బాధపడిన శ్రీజ అనే బాలికకు పవన్ చికిత్స చేయించి.. ఆమెను కోలుకునేలా చేశారు. ఇదే తరహాలో అబ్బాయ్ చెర్రీ ధను

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (17:17 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ పయనిస్తున్నాడు. అప్పట్లో క్యాన్సర్‌తో బాధపడిన శ్రీజ అనే బాలికకు పవన్ చికిత్స చేయించి.. ఆమెను కోలుకునేలా చేశారు. ఇదే తరహాలో అబ్బాయ్ చెర్రీ ధనుష్ అనే బాలుడికి సహాయం అందించాడు. 
 
ధనుష్ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని అతడి తల్లిదండ్రులు చెర్రీ ఎదుట గోడును వెళ్ళబోసుకున్నారు. దీంతో ఆ బాలుడికి చెర్రీ చికిత్స చేయించాడు. హైదరాబాదులో ఆ అబ్బాయికి చికిత్స జరిగింది. ఈ ఖర్చంతా చెర్రీ భరించారు. ప్రస్తుతం ధనుష్ ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ విషయాన్ని ధనుష్ తల్లిదండ్రులు చెర్రీ తాజా సినిమా రంగస్థలం షూటింగ్ స్పాట్‌లో తెలియజేశారు. 
 
చెర్రీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకుడు. సమంత కథానాయిక. ఏప్రిల్‌లో ఈ చిత్రం షూటింగ్‌ రాజమహేంద్రవరం పరిసరాల్లో జరిగింది. ఆ సమయంలో అక్కడి గ్రామానికి చెందిన ధనుష్‌ కుటుంబం రామ్‌చరణ్‌ను కలిసింది. అదే ‘రంగస్థలం’ షూటింగ్‌ మళ్లీ రాజమహేంద్రవరం పరిసరాల్లోనే జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడికి ధనుష్‌, కుటుంబ సభ్యులు వెళ్లారు. చరణ్‌ను కలిసి ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. అంతేకాదు ధనుష్‌ చెర్రీకి కిస్‌తో పాటు, ''మగధీర"లోని డైలాగ్‌ చెప్పి సర్‌ప్రైజ్‌ చేశాడట.
 
ఇదిలా ఉంటే.. చెర్రీ తన అభిమానుల కోసం రంగస్థలం షూటింగ్‌ను కాసేపు ఆపాడు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో చెర్రీని కలిసేందుకు వస్తున్న చిన్నాపెద్ద అభిమానులను చెర్రీ పలకరించాడు. వారికి ఆటోగ్రాఫ్‌లిచ్చాడు. యువత కూడా చెర్రీని కలిసేందుకు ఆసక్తి చూపుతోంది. కళాశాల విద్యార్థులు ఆయన్ని నేరుగా చూసి.. ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments