Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ 'ధృవ'తో వెనుకడుగు వేసిన బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ' దెబ్బకు బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' వెనుకడుగు వేసింది. నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (11:21 IST)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ' దెబ్బకు బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' వెనుకడుగు వేసింది. నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తికావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ కూడ ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 9న అదే విధంగా పాటలను డిసెంబర్ 16న విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడ చేశారు.
 
అయితే, రామ్ చరణ్ 'ధృవ' డిసెంబర్ 9న విడుదల అవుతున్న నేపథ్యంలో అదేరోజు బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను విడుదల చేస్తే 'ధృవ' హడావిడి మధ్య సామాన్య ప్రేక్షకులు పట్టించుకోరు అన్న భయం 'శాతకర్ణి' యూనిట్‌కు ఏర్పడినట్లు టాక్. దీనితో 'శాతకర్ణి' మూవీ ట్రైలర్‌ను 'ధృవ' విడుదలకు ఒక రోజు ముందు కానీ లేదా 'ధృవ' విడుదల అయిన మరునాడు కాని విడుదల చేయడానికి 'శాతకర్ణి' యూనిట్ డిసైడ్ అయినట్లు టాక్. 
 
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 200 థియేటర్స్‌లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇంత భారీ ఎత్తున్న విడుదల చేస్తున్న 'శాతకర్ణి' ట్రైలర్ 'ధృవ' హడావిడిలో విడుదల చేస్తే చాలా మంది పట్టించుకోక పోవచ్చు అన్న భావనతో ఈనిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments