Webdunia - Bharat's app for daily news and videos

Install App

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (14:07 IST)
ఎస్.శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "గేమ్ ఛేంజర్". జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 9వ తేదీన లక్నోలో విడుదల చేయనున్నారు. ఇదేసమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ టీజర్‌ను 11 సెంటర్స్‌లో ఈ టీజర్‌ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. 
 
హైదరాబాద్ నగరంలోని సుదర్శన్, వైజాగ్ సంగం శరత్, రాజమండ్రి శివ జ్యోతి, విజయవాడ శైలజ, కర్నూల్ వి మెగా, నెల్లూర్ ఎస్2 థియేటర్, బెంగళూర్ ఊర్వశి థియేటర్, అనంతపూర్ త్రివేణి, తిరుపతి పీజీఆర్, ఖమ్మం ఎస్‌వీసీ థియేటర్లలో టీజర్‌ను అభిమానుల సమక్షంలో రిలీజ్ చేస్తున్నారు.
 
ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి "జరగండి... జరగండి" పాటతో పాటు 'రా మచ్చా రా... సాంగ్' అనే మరో పాటను విడుదల చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికల నిర్వహణను పరీక్షించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
 
అవినీతి రాజకీయ నాయకుల నుంచి దేశాన్ని కాపాడటానికి ఎన్నికల నిర్వహణను నిజాయతీగా ఎలా నిర్వహించాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది కథ. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments