Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరును వాడుకోవద్దు.. తేజ్‌కు చెర్రీ క్లాస్: చిరు సాంగ్స్ జోలికెళ్లనన్న సుప్రీమ్ హీరో!

Webdunia
శనివారం, 28 మే 2016 (18:47 IST)
బ్రూస్ లీ ఫట్‌తో స్క్రిప్ట్ ఎంపికలో ఆచితూచి వ్యవహరించి ప్రస్తుతం తమిళ తని ఒరువన్‌ను ధృవగా రీమేక్ చేస్తున్న రామ్ చరణ్.. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్‌ను చూసి జెలసీగా ఫీలవుతున్నాడా? అనే ప్రశ్నకు సినీ జనం అవుననే సమాధానం చెప్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చిన్న బడ్జెట్ చేసినా.. స్టార్ హీరో రేంజ్‌లో పేరు కొట్టేసేందుకు.. చిరును ఆతను వాడుకోవడమే కారణమని చెర్రీ తీసిపారేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. చిరంజీవి పేరును వాడుకోకుండా వారి వారి మేనరిజంకు తగ్గట్టు పేరు సంపాదించుకోవాలి కానీ.. మెగా పవర్‌ను ఉపయోగించుకోకూడదని చెర్రీ సాయిధరమ్ తేజ్‌కు చెప్పినట్లు సమాచారం.  
 
సాయిధర్మ్ తేజ్ ప్రతి సినిమాలోనూ తండ్రి చిరంజీవిని వాడుకుంటున్నాడని, అంతేగాకుండా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తనను కూడా డామినేట్ చేస్తున్నాడని చెర్రీ భావిస్తున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం చెర్రి ఈ మధ్యనే తేజ్ కి కాస్త క్లాస్ పీకాడట. ఇక నుంచి తన ఫాదర్ చిరంజీవి పేరును వాడుకోవడం తగ్గించి నీకు నువ్వుగా నటనలో ఎదగమని కూల్‌గా తేజ్‌కి చెప్పినట్లు టాక్.
 
ఇకపోతే.. గ్యాంగ్ లీడర్ సినిమాను సాయిధరమ్ తేజ్ రీమేక్ చేస్తే బాగుంటుందని వచ్చిన వార్తలపై కూడా సాయి స్పందించాడు. ఆ సినిమాను చిరంజీవి తన పుత్రుడు చెర్రీ హీరోగా రీమేక్ చేయించాలని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపిన నేపథ్యంలో.. ఆ సినిమాను రీమేక్ చేయనని సాయిధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అంతేగాకుండా.. ఇకపై చిరంజీవి సాంగ్స్ కూడా రీమేక్ చేయనని తేల్చి చెప్పేశాడు. ఈ కామెంట్స్‌ను బట్టి చెర్రీ.. సాయిధరమ్‌కు క్లాస్‌ తీసుకున్నాడనే మాట నిజమేనని సినీ జనం అనుకుంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments