రంగస్థలం ఫస్ట్‌లుక్.. చిట్టిబాబుగా చెర్రీ.. మార్చి 30న విడుదల

రంగస్థలం ఫస్ట్ లుక్ విడుదలైంది. సైరా పనుల్లో మెగా చెర్రీ బిజీగా వుండటంతో ఫస్ట్ లుక్‌ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే శనివారం (డిసెంబర్ 9)న మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా రంగస్థలం ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (09:18 IST)
రంగస్థలం ఫస్ట్ లుక్ విడుదలైంది. సైరా పనుల్లో మెగా చెర్రీ బిజీగా వుండటంతో ఫస్ట్ లుక్‌ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే శనివారం (డిసెంబర్ 9)న మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా రంగస్థలం ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. సైరా నరసింహా రెడ్డి సినిమా సెట్స్ పైకి రావడం, పవన్ కల్యాణ్ ఏపీ పర్యటనలో దుమ్ముదులిపే స్పీచ్‌ ఇవ్వడానికి తోడు మెగా అభిమానులు రంగస్థలం ఫస్ట్ లుక్ విడుదల కావడంతో పండగ చేసుకుంటున్నారు. 
 
రంగస్థలంలో చెర్రీ హీరోగా, అక్కినేని ఇంటి కోడలు సమంత హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1980 జరిగిన కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 
 
ఇక రంగస్థలం ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ''రంగస్థలం''లోని ''చిట్టిబాబు'' 2018 మార్చి 30న కలవండి.. అని చెర్రీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ద్వారా ''రంగస్థలంలో'' చిట్టిబాబు పాత్రను చరణ్ పోషిస్తున్నట్టు స్పష్టమైంది. సినిమా కూడా మార్చి 30 నాటికి రిలీజ్ కానుందని తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments