Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ ట్రూజెట్‌తో ప్రయాణీకుల ఇబ్బందులు.. డబ్బిచ్చేయడంతో వేరే విమానాల్లో?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (12:12 IST)
మెగాస్టార్ తనయుడు యంగ్ హీరో రామ్ చరణ్ తేజ భాగస్వామ్యంలో నింగికెగసిన ట్రూజెట్ (టర్బో మేఘా ఎయిర్ వేస్)తో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రూజెట్ విమానం కోసం ఉదయం నుంచి రాత్రి దాకా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పడిగాపులు పడేలా చేయడంతో ప్రయాణీకులు మండిపడ్డారు. 
 
ఉదయం 8 గంటలకు హైదరాబాదు నుంచి తిరుపతి బయలుదేరాల్సిన ట్రూజెట్ విమానం సాయంత్రం 6 గంటలకు గాని బయలుదేరలేదు. ట్రూజెట్‌లో ప్రయాణం కోసం టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు శుక్రవారం ఉదయమే శంషాబాదు ఎయిర్ పోర్టు చేరుకున్నారు. కానీ విమానం రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగేలోగానే రంగప్రవేశం చేసిన టర్బో మేఘా ఎయిర్ వేస్ అధికారులు అనివార్య కారణాల వల్ల విమానాన్ని 6 గంటలకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్త విమానయాన సంస్థ కదా, సరేలే అనుకుంటూ ప్రయాణికులు సర్దుకుపోయారు. 
 
అయినా సాయంత్రం 6.30 గంటలకు వచ్చిన విమానం ప్రయాణికులను తీసుకుని తిరుపతికి బయలుదేరి, మరి కాసేపటికే తిరిగి శంషాబాదుకు చేరుకుంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రన్ వేపైనే ఆందోళనకు దిగారు. తిరుపతిలో వాతావరణం అనుకూలించని కారణంగానే తిరిగి శంషాబాదు రావాల్సి వచ్చిందని చెప్పిన అధికారులు టికెట్ డబ్బుల్ని తిరిగిచ్చేశారు. దీంతో వేరే విమానాల్లో ప్రయాణీకులు గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments