Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్‌కు ఓకే.. భార్యకు కాఫీ పెట్టిచ్చిన హీరో...

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (15:12 IST)
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో సెలెబ్రిటీల్లో ఒక్కొక్కరు ఒక్కో విధమైన పనులు చేస్తూ తమ సమయాన్ని గడిపేస్తున్నారు. కొందరు కరోనాపై అవగాహనలో భాగంగా విస్తృతమైన ప్రచారాలు చేస్తుంటే మరికొందరు వివిధ రకాలైన ఛాలెంజెస్ చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో సినీ దర్శకుడు వంగా సందీప్ విసిరిన 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్‌ను దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి స్వీకరించారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా రాజమౌళి తన ఇంటిని పరిశుభ్రం చేశారు. 
 
ఆ తర్వాత టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లకు ఛాలెంజ్ విసిరారు. ఈ సవాలును ఇప్పటికే జూ.ఎన్టీఆర్ స్వీకరించి తన ఇల్లు వాకిలిని శుభ్రం చేశారు. పైగా ఇంట్లోని టైల్స్‌కు మాఫ్ కూడా వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అలాగే, ఇపుడు మరో హీరో రాం చరణ్ కూడా స్వీకరించారు. 
 
ఈ సవాలులో భాగంగా, ఇంటిని శుభ్రం చేసిన చెర్రీ.. ఆపై బట్టలు పిండి, మొక్కలకు నీళ్లు పోసి, భార్య ఉపాసనకు కాఫీ పెట్టి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 
 
ఇంట్లో ఈ పనులు చేయడం పట్ల గర్వంగా ఉందన్నాడు. మహిళల వర్క్‌ లోడ్‌ను షేర్ చేసుకుని నిజమైన మగాడిలా ఉండాలని సూచించాడు. ఆ తర్వాత తాను మరో ఇద్దరికి ఛాలెంజ్ విసిరాడు. వారిలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉండగా, రణ్‌వీర్, రానా, శర్వానంద్‌లు ఉన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments