Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్ బాత్ చేస్తూ వీడియోను పంచుకున్న చిరుత హీరోయిన్ నేహా శర్మ (video)

ఐవీఆర్
శనివారం, 1 జూన్ 2024 (13:44 IST)
నేహా శర్మ. చిరుత చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించిన ఈ భామ ఆ తర్వాత హిందీ సినిమాలకే పరిమితమైంది. అవకాశం దొరికినప్పుడల్లా తను చేసే పనులన్నింటినీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. తను చేస్తున్న వ్యాయామం, ఆహారపు అలవాట్ల గురించి ఫోటోలు ఇతరత్రా సమాచారాన్ని పంచుకుంటుంది. ఇప్పుడు భయంకరమైన వేసవిలో జిల్లుమంటున్న ఐస్ బాత్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. 
 
మంచుతో నిండిన టబ్‌లో నేహా శర్మ కనీసం 4 నిమిషాల పాటు కూర్చుంది. క్రీడాకారులు, సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో ఐస్ బాత్ బాగా చేస్తున్నారు. ఐస్ బాత్‌ను ఈతగాళ్లు, కఠినమైన క్రీడల్లో పాల్గొనేవారు, ఫుట్‌బాల్ ఆటగాళ్ళు, భారీ వ్యాయామశాలకు వెళ్లేవారు ఉపయోగిస్తారు. చాలా చల్లటి నీటిలో కూర్చోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 
 
వ్యాయామంతో అలసిపోయిన కండరాలు త్వరగా రిలాక్స్ అయ్యే స్థితికి వెళ్లి, శరీరం మళ్లీ వ్యాయామానికి సిద్ధమవుతుంది. అలాగే రక్తప్రసరణ సులభతరం అవుతుంది. ఐస్ బాత్ వల్ల శరీరంపై పట్టు పెరుగుతుంది. చల్లటి నీళ్లలో కూర్చోవడం వల్ల వణుకు, ఊపిరి ఆడకపోవటం, గుండె కొట్టుకునే వేగం వంటి వాటిని నియంత్రించే సామర్థ్యం పెరుగుతుంది. ఇది శరీరంపై, ముఖ్యంగా శ్వాసపై నియంత్రణను పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన విద్యామంత్రి నారా లోకేశ్

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా!!

వైకాపా ఓడిపోవడానికి కారణం అదే ... పవన్‌ది డైనమిక్ పాత్ర : సీపీఐ నారాయణ

మిస్సింగ్ అమ్మాయిలను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగం : డిప్యూటీ సీఎం పవన్

ప్రజావాణికి మంచి రెస్పాన్స్.. దరఖాస్తుల వెల్లువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments