పద్మశ్రీ బ్రహ్మానందం తన ఆత్మకథ పుస్తకం `నేను` పేరుతో రచించారు. ఈ విషయాన్ని ఇటీవలే ఓ సాహిత్య వేడుకలో స్వయంగా చెప్పారు. ఆ వేడుకలో డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ముఖ్య అతిథి. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, గరికపాటి గారి ముందు తామంతా గరికలాంటివారమని.. ఆయన ముందు మేం చెప్పే మాటలు కుప్పిగంతులు లాంటివని తన దైన శైలిలో వర్ణించారు. అందులో భాగంగానే... నేను నా ఆత్మ కథ రాశాను. త్వరలో దానిని బయటకు తేనున్నాను. అందులో అన్ని సంగతులు వుంటాయని పేర్కొన్నారు.
కాగా, నేడు బ్రహ్మానందం తాను రాసిన నేను అనే త్మకథ పుస్తకం కాపీని రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ కు వెళ్లి ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ఇది చాలా విలువైనదనీ, ఇప్పటి జనరేషన్ బ్రహ్మానందంగారిలో ఎన్నో కోణాలు ఇందులో కనిపిస్తాయని అన్నారు.
సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ, 'నేను'లో బ్రహ్మానందం గారి అపురూపమైన జీవితంలో ప్రయాణం చేస్తూ, హాస్యం మరియు హృదయంతో రూపొందించిన అతని ఆత్మకథ. ఈ పేజీలు నవ్వుల సారాంశం, జీవిత పాఠాలు మరియు అతను మనందరికీ తీసుకువచ్చిన సినిమా మనోజ్ఞతను కలిగి ఉన్నాయి అని రామ్ చరణ్ పేర్కొన్నారు.