Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంకర్‌ దర్శకత్వంలో యూత్‌ లీడర్‌గా రామ్‌చరణ్‌

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (11:40 IST)
Ramcharan at kondareddy buruju
తమిళ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్‌.సి.15గా వర్కింగ్‌ టైటిల్‌ వుంది. ఈ చిత్రం ఇటీవలే కొంత టాకీ పూర్తయింది. తాజాగా కర్నూల్‌లో శుక్రవారంనాడు షూట్‌ చేశారు. అక్కడకు రామ్‌చరణ్‌ వస్తున్నారని తెలియగానే వేలాదిమంది యూత్‌ ఆయన బ్లాక్‌ కార్‌ వాహనం వెంట పడ్డారు. స్థానిక పోలీసులు పర్యవేక్షించారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు ప్రాంతమంతా రాజకీయ పార్టీ జెండాలతో నిండిపోయింది.
 
అక్కడకు రామ్‌చరణ్‌ వచ్చి కొండారెడ్డిబురుజు నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఓ రాజకీయ పార్టీ నాయకుడుగా యూత్‌లీడర్‌గా ఆయన నటిస్తున్నారు. ప్రజల మంచి కోసం, బాగు కోసం నేను ఈ కండువా వేసుకున్నానంటూ చెప్పిన ఆయన డైలాగ్‌కు అక్కడివారంతా కేరింతలతో నిండిపోయింది. పై నుంచి అందరికీ విషెస్‌ చెప్పారు. దర్శకుడు శంకర్‌ ఇందులో రామ్‌ చరణ్‌ను ద్విపాత్రాభినయం చేయిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి, నవీన్‌ చంద్ర, జయరామ్‌, సునీల్‌ తదితరులు నటిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments