మెగాస్టార్ చిరంజీవి తాతయ్య కాబోతున్నారు. అదీ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ద్వారా. అవును మీరు చదువుతున్నది నిజమే. రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు మెగాస్టార్.
ఆ హనుమంతుడి దయతో చెర్రీ దంపతులు త్వరలోనే తమ తొలి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకువస్తారని చిరంజీవి చేసి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, చెర్రీ- ఉపాసన దంపతులకు 2012లో వివాహం అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ దంపతులు ఎప్పుడు శుభవార్త చెప్తారా అంటూ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. చెర్రీ దంపతుల తరపున మెగాస్టార్ ఆ గుడ్ న్యూస్ చెప్పేశారు.