Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోయినవారిని తీసుకుని రాలేం.. కానీ, అండగా నిలుస్తాం : చెర్రీ ఆర్థిక సాయం (video)

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (14:22 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలో విషాదం జరిగింది. పవన్ బర్త్‌డే వేడుకల్లో భాగంగా, మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి బలయ్యారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీరని శోకం అలముకుంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే, చనిపోయిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయాల్సిందిగా చిత్తూరు జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
 
అలాగే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్ర నిర్మాతలు కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇకపోతే, ఈ విషాద ఘ‌ట‌న‌పై మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, హీరో రాంచ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్ త‌దిత‌రులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 
 
హీరో అల్లు అర్జున్ పెద్ద మ‌న‌సు చేసుకొని మ‌ర‌ణించిన కుటుంబం ఒక్కొక్క‌రికి రూ.2 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక రాంచ‌ర‌ణ్ ప్ర‌తి కుటుంబానికి 2.50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇవ్వ‌నున్న‌ట్టు త‌న ట్వీట్‌లో తెలిపారు. మ‌ర‌ణించిన వారిని తిరిగి తీసుకురాలేము. ఇలాంటి స‌మయంలో వారి కుటుంబాల‌ని ఆదుకునేందుకు నా వంతుగా ఈ సాయం చేస్తున్నాను అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments