Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవ్స్‌లో షికారు చేస్తోన్న‌ రామ్, నిధి అగ‌ర్వాల్... ఇంత‌కీ అక్క‌డ ఏం చేస్తున్నారు..?

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (18:29 IST)
మాల్దీవ్స్‌లో రామ్, నిధి అగ‌ర్వాల్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా..? ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ న‌టిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ బ్యాన‌ర్స్ పైన పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ల పైన మాల్దీవుల్లో చిత్రీక‌రిస్తున్నారు. అందుక‌నే వీరిద్ద‌రు మాల్దీవ్స్ వెళ్లార‌ట‌. భాస్క‌ర భ‌ట్ల ర‌చించిన `లవ్‌` సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రిస్తుండ‌టం విశేషం. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. ఇదిలా ఉంటే... జిందాబాద్ జిందాబాద్ ఎర్ర‌నీ పెద‌వుల‌కి.. జిందాబాద్ జిందాబాద్ కుర్రాడి చూపుల‌కి అంటూ సాంగే స్పైసీ & రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేసారు. 
 
రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు, దిమాక్ ఖ‌రాబ్ అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రోజు రిలీజ్ చేసిన జిందాబాద్ సాంగ్‌కు కూడా విశేష స్పంద‌న ల‌భిస్తుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసి ఈ సినిమాను జూలై 12న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌కనిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments