Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్ గోల్డెన్ ఛాన్స్.. ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవిగా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు గోల్డెన్ ఛాన్స్ వరించింది. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రా

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (17:03 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు గోల్డెన్ ఛాన్స్ వరించింది. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరో, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ నటిస్తున్నారు.
 
ఇందులో పలు పాత్రలకు పలువురు ప్రముఖులను ఎంపిక చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఎన్టీఆర్‌గా బాలయ్య నటిస్తుండగా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. ఆరు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న విద్యా తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేసుకుందని తెలుస్తుంది. 
 
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆయన శ్రీదేవితో కలిసి ఎన్నో హిట్స్ అందించాడు. ఈ క్రమంలో ఆమె పాత్రని కూడా ఎన్టీఆర్ బయోపిక్‌లో చేర్చాలని మేకర్స్ భావించారు. ఇందుకోసం బాలీవుడ్ నటులు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్‌లని సంప్రదించారని ప్రచారం జరిగింది. 
 
కానీ, శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్‌ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. ప్రస్తుతం అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ డేట్స్ తీసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీదేవికి వీరాభిమాని అయిన రకుల్ కూడా ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారట. 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బయోపిక్ త్వరలో రెండో షెడ్యూల్ జరుపుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments