Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయాలకు దూరమైన రకుల్ .. అయినా ఆమె పారితోషికం 2 కోట్లు

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (11:43 IST)
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా అగ్రస్థానానికి చేరుకున్న కథానాయికల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా కనిపిస్తారు. స్టార్ హీరోలందరితోనూ వరుసబెట్టి సినిమాలు చేసేసి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ... గ్లామర్ పరంగానూ... నటన పరంగానూ మంచి మార్కులు కొట్టేస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఆమెను విజయాలు ఎంత వేగంగా వరించాయో... పరాజయాలు కూడా అంతే వేగంగా పలకరిస్తున్నాయి.
 
ఆవిడకి తెలుగు... తమిళ భాషలలో సక్సెస్ అనే మాట వినబడి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి 'మన్మథుడు 2' సినిమా నుండి ఆఫర్ అందింది. ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్లు అందరూ ఇప్పటికే కింగ్ నాగార్జునతో కలిసి చేసేసి ఉండడంతో ఈ పాత్ర కోసం రకుల్‌ను సంప్రదించారట. అయితే సదరు పాత్రకు పారితోషికంగా ఆవిడ రూ. 2 కోట్లు అడిగిందట. సీనియర్ హీరోయిన్ల కొరత కారణంగా, రకుల్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడినట్లుగా సమాచారం.
 
ఏది ఏమైనప్పటికీ... విజయాలున్నా... లేకున్నా... డిమాండ్ ఉంటే చాలని నిరూపించేస్తోంది రకుల్...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments