నిర్మాత 'దిల్' రాజుతో రకుల్ ''దాగుడు మూతలు''

టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన 'దిల్' రాజుతో దాగుడు మూతలు ఆడుతున్నట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (13:49 IST)
టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన 'దిల్' రాజుతో దాగుడు మూతలు ఆడుతున్నట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా ఒక హీరోయిన్ దిల్ రాజు సారథ్యంలోని నిర్మాణ సంస్థలో పని చేసేందుకు ఇష్టపడతారు. నిర్మాత నుంచి ఆఫర్ వచ్చిందంటే వెనుకాముందు ఆలోచన చేయకుండా ఒప్పేసుకుంటారు. కానీ, రకుల్ మాత్రం దిల్ రాజుతో 'దాగుడు మూతలు' ఆడుతోందట.
 
మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ - దిల్ రాజుల కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. ఇందులో నితిన్, శర్వానంద్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అంటే యువ మల్టీస్టారర్ చిత్రమన్నమాట. ఇందులో ఒక హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేస్తే మరో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసేందుకు ఆమెను సంప్రదించారట. 
 
తొలుత ఆమె ఓకే అన్నట్టుగా ప్రచారం జరిగింది గానీ, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. హరీశ్ శంకర్ కి 'ఎస్' అని గానీ .. 'నో' అని గాని చెప్పకుండా ఆయనతో ఆమె 'దాగుడుమూతలు' ఆడుతోందని కొందరు జోక్ చేస్తున్నారు కూడా. 
 
కాగా, దిల్ రాజు - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో జూనియర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', సాయిధరమ్ తేజ్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్', అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' చిత్రాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇపుడు మరోమారు ఇదే కాంబినేషన్‌ రిపీట్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments