Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైన్ షాపుకెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ : లిక్కర్ కొనేందుకే వెళ్లిందా?

Webdunia
గురువారం, 7 మే 2020 (21:38 IST)
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన ఓ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె గురువారం ఓ వైన్ షాపుకెళ్లి ఏదో కొనుగోలు చేసినట్టు ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోనే ఇపుడు సంచలనం అయింది. 
 
ఆ షాకుకెళ్లిన ఆమె చేతిలో ఏవో పట్టుకుని రోడ్డుపై వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా.. ఆమె వైన్ షాపుకు వెళ్లి మద్యం బాటిళ్లను కొనుక్కొని వస్తుందని కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేయడం మొదలెట్టారు. 
 
దీనికి కారణం లేకపోలేదు. ఈ లాక్‌డౌన్ సమయంలో ఏరోజూ రోడ్డుపై కనిపించని రకుల్.. తాజాగా కేంద్ర ప్రభుత్వం మద్యం షాపులకు ఇచ్చిన సడలింపుల టైమ్‌లో అలా కనిపించే సరికి అంతా అలా అనుకున్నారు. 
 
కానీ అక్కడ వాస్తవం వేరు. ఆమె మెడికల్ షాపుకి వెళ్లి.. మందులు కొనుక్కొని.. ఒక చేతిలో మెడిసిన్స్, మరో చేతిలో తన వాలెట్ పట్టుకుని వస్తుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
ఈ ట్రోలింగ్‌పై తాజాగా రకుల్ కౌంటరేసేలా ట్వీట్ చేసింది. 'వావ్.. మెడికల్ షాపులలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే విషయం నాకు తెలియదు' అంటూ వింతైన ఇమోజీలతో ఓ ట్వీట్ వేసింది. ఈ ట్వీట్‌తో ఇప్పటివరకు తనపై ట్రోల్ చేసిన వారికి చెంపపెట్టులా మారిందని ఆయన అభిమానులు అన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక : విప్ జారీ చేసిన టీడీపీ!!

నంద్యాలలో టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి సతీమణి మృతి!!

ఆ మార్గంలో 78 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే!!

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments