శ్రీరెడ్డి పెద్ద --- రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు (Video)

ఎప్పుడూ సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుపోయే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కసారిగా ఒక నటిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కొంతమంది హీరోయిన్లు సహచర హీరోయిన్లపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తెలుగు సినీపరిశ్రమనే ప

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (19:14 IST)
ఎప్పుడూ సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుపోయే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కసారిగా ఒక నటిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కొంతమంది హీరోయిన్లు సహచర హీరోయిన్లపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తెలుగు సినీపరిశ్రమనే పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో తను బాధపడ్డానని చెప్పుకొచ్చారు.
 
శ్రీరెడ్డి అనే నటిని ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఆమె ఏం మాట్లాడుతుందో నాకైతే అర్థంకావడం లేదు. శ్రీరెడ్డి ఏమైనా పెద్ద హీరోయిన్ అనుకుంటుందా... ఏంటో నాకైతే అర్థం కాలేదు. తెలుగు సినీ పరిశ్రమలో మొత్తం దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇది తలచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ముంబైని వదిలి హైదరాబాద్‌లో ఉన్నానంటే ఇక్కడ పరిశ్రమలో ఎలాంటి వాతావరణం ఉంటుందో మా తల్లిదండ్రులకు బాగా తెలుసు. అందుకే నన్ను ఇక్కడే ఉండి షూటింగ్ చేసుకోమని చెబుతున్నారు మావాళ్ళు. 
 
అయితే శ్రీరెడ్డి లాంటి వారి వల్ల హీరోయిన్లు అందరిపైనా ప్రజలకు చెడు ఉద్దేశం వస్తుంది. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడటం ఇప్పటికైనా మానుకోండి అంటూ రెండు చేతులెత్తి దండం పెడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఏ హీరోయిన్ స్పందించకుండా ఒక్క రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం స్పందించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరి మిగిలినవాళ్లు కూడా మెల్లిగా లైన్లోకి వస్తారేమో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments