Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలెక్కనున్న రకుల్ ప్రీతి సింగ్!?

వరుణ్
మంగళవారం, 16 జనవరి 2024 (11:19 IST)
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. గత కొంతకాలంగా డేటింగ్ ఉన్న తన ప్రియుడైన నటుడు జాకీ భగ్నాని వివాహం చేసుకోనున్నారని, వీరి వివాహం ఈ యేడాది మార్చి నెలలో జరుగనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై రకుల్ క్లారిటీ ఇచ్చింది. 
 
గత కొంతకాలంగా తాను సింగిల్‌గా ఉన్నానని ఆమె చెప్పారు. భాగస్వామిని కలిగివుండటం ఒక సహజ ప్రక్రియ అని, అయితే దురదృష్టవశాత్తూ సినీ ఇండస్ట్రీలో ఉండేవారిపై చాలా ప్రచారాలు జరుగుతుంటాయని ఆమె చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మనుషులమేనని, అందరికీ భావోద్వేగాలు, బాధలు ఉంటాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
జాకీతో ఎమోషనల్ బ్యాలెన్స్‌పై స్పందిస్తూ ఇద్దరం సినిమా రంగానికి చెందినవారమేనని రకుల్ చెప్పింది. తాను స్వతంత్రంగా వ్యవహరించే అమ్మాయినే అయినప్పటికీ జాకీ వద్దకు పరిగెత్తుకెళ్లిన రోజులు ఉన్నాయని తెలిపింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడంతో జాకీ తనను అర్థం చేసుకునేవాడని తెలిపింది. 
 
తామిద్దరం ఎప్పుడూ సినిమాకి సంబంధించిన విషయాలనే కాకుండా ఇతర అంశాల గురించి కూడా మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. ఫిటెనెస్‌కు సంబంధించిన అంశాలపై దృష్టి సారించేవారిమని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన ఆలోచనలను పంచుకున్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments