Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండోమ్ టెస్టర్‌గా రకుల్ ప్రీత్ సింగ్ కొత్త అవతారం

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (22:12 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్‌గా కొత్త అవతారం ఎత్తింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తేజాస్ దర్శకత్వంలో, రోనీ స్క్రూవాలా నిర్మాణంలో ఛత్రివాలి అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ఫస్ట్ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కండోమ్ ప్యాకెట్‌ని ఓపెన్ చేస్తూ కనిపిస్తోంది. కండోమ్ టెస్టర్ అంటే.. కండోమ్ నాణ్యతని అనుభవపూర్వకంగా శృంగారంలో పాల్గొని తెలుసుకోవాలి. కండోమ్ తయారు చేసిన కంపెనీకి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. దీనితో కండోమ్ టెస్టర్లు కంపెనీ నుంచి వేతనం పొందుతారు. రకుల్ పోషిస్తున్న ఈ పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది. ఇక కథ పరంగా శృంగార సన్నివేశాలు ఉంటాయి. 
 
ఇలాంటి చిత్రంలో నటించడంపై తాజాగా రకుల్ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలుండవని.. వాస్తవానికి ఫ్యామిలీ మొత్తం ఈ చిత్రాన్ని చూడాలి. ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే అవగాహన పెరుగుతుంది అని రకుల్ ప్రీత్ తెలిపింది. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి ఉద్యోగం కోసం కండోమ్ టెస్టర్‌గా మారిన అమ్మాయి కథే ఈ చిత్రమని తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం