Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్‌పాట్ కొట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్.... (Video)

టాలీవుడ్‌లో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. గత కొంతకాలంగా ఈమె సినీ కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. పైగా, ఈ అమ్మడు నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో రకుల్‌క

Webdunia
సోమవారం, 30 జులై 2018 (14:06 IST)
టాలీవుడ్‌లో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. గత కొంతకాలంగా ఈమె సినీ కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. పైగా, ఈ అమ్మడు నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో రకుల్‌కు సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి కూడా. దీనికితోడు వెండితెరపై కొత్త అమ్మాయిలు అందాలు ఆరబోసేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. దీంతో రకుల్ హవా తగ్గిపోయిందని ప్రతి ఒక్కరూ భావించారు.
 
అయితే, రకుల్‌కు ఇపుడు ఓ బంపర్ ఆఫర్ వరించింది. 'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో'. ఈ చిత్రం తర్వాత 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ పీరియాడికల్ స్టోరీతో ప్రభాస్‌తో ఓ చిత్రం చేయనున్నారు. ఇందులో రకుల్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారని సమాచారం. అలాగే, మరో రెండు మూడు చిత్రాల్లో ఆమె నటించేందుకు సమ్మతించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ప్రభాస్‌ను ఇందులో దర్శకుడు చాలా కొత్తగా చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదలకు ముందే ప్రభాస్.. రాధాకృష్ణ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది. మొత్తంమీద రకుల్ మళ్లీ తన పూర్వవైభవాన్ని పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments